CM KCR:మేడ్చల్ అభివృద్ధి బాధ్యత నాదే

39
- Advertisement -

మేడ్చల్ అభివృద్ధి బాధ్యత తనదేనన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా  నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..పరిపాలన సంస్కరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని మేడ్చల్ జిల్లాగా చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ పోరాటమే లేకపోతే ఈ మేడ్చల్ జిల్లానే వచ్చేది కాదన్నారు. మేడ్చల్ ప్రజలు చైతన్య వంతులన్నారు. నాడు తెలంగాణ కోసం ఒక్కడినే కదలినప్పుడు ఎన్నో అవమానాలు చేశారన్నారు. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు పోతున్నామో మీ ముందే ఉందన్నారు.

కరెంట్ కోతలు, బొంబాయి వలసలు ఇది సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితి. కానీ ఇవాళ స్వరాష్ట్రంలో ఒక్కో రంగంలో అభివృద్ధి సాధించామని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ నేతలు సమైక్య పాలకుల చేతుల్లో బానిసల్లాగా ఉన్నారన్నారు. మంచినీరు కూడా లేని పరిస్థితి సృష్టించారని గుర్తు చేశారు. సాగునీటి రంగంలో దేశానికే తలమానికంగా నిలిచామన్నారు. దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని….మిగితా రాష్ట్రాలకు దారి చూపుతున్నామని చెప్పారు. కులం, మతం బేధం లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మేడ్చల్‌లో 26 వేల ఇండ్లు పేదలకు అందించామన్నారు.

Also Read:CM KCR:బంగారు తునకగా పాలమూరు

10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని మరోసారి ఆశీర్వదించి దీవించాలన్నారు. ఎన్నికలప్పుడు ఆపద మొక్కులు మొక్కేవారు వస్తారని వారిని గమనించాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు,సీతారామ ఎత్తిపోథల పథకంతో సాగునీటి కొరత తీరిందన్నారు. మిషన్ భగీరథతో మంచినీటి సమస్యకు చెక్ పెట్టామన్నారు. మేడ్చల్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారని…ఇది మినీ భారతదేశం అన్నారు.

మేడ్చల్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని చెప్పారు సీఎం. తెల్ల రేషన్ కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా అందిస్తామన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు. అగ్రవర్ణాల పేదల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రేటర్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. మల్లారెడ్డికి మరోసారి అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు సీఎం.ప్రజల కష్టాలు అర్ధం చేసుకునే మల్లారెడ్డి లాంటి వ్యక్తులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Also Read:KTR:గంగులతో పోటీ అంటే పారిపోతున్నారు

- Advertisement -