KCR:గజ్వేల్ నుండి గెలిచే సీఎం అయ్యా..

42
- Advertisement -

గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యానని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..గత పదేళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందన్నారు. గతంలో మంచినీటి కోసం హరిగోస పడ్డ గజ్వేల్ కష్టాలు తీరిపోయాయని చెప్పారు. గజ్వేల్‌కు ప్రాజెక్టులు, సాగు నీరు వచ్చిందన్నారు. గజ్వేల్‌కు రైలు కూడా వచ్చిందన్నారు. గజ్వేల్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.

గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడటానికి తండోపతండాలుగా జనం వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట నాకు బలాన్ని ఇస్తే…ముఖ్యమంత్రిని చేసింది గజ్వేల్ గడ్డ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి కష్టాలు తీరాయన్నారు. గజ్వేల్ మరింత అభివృద్ధి చెందాలన్నారు.తెలంగాణ ఆశగా, శ్వాసగా బతికానని తెలిపారు సీఎం.

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగినయ్‌. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చిచంపిండ్రు అన్నారు.ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టేవారని..రూ.2 కే బియ్యం ఎందుకు ఇవ్వాల్సివచ్చిందో ఆలోచించాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోసపెట్టిందన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదు అన్నారు. తెలంగాణ ఏర్పడంగనే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆసరా పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చినం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము నిర్ణయాలు చేశామని తెలిపారు సీఎం కేసీఆర్.

Also Read:తలనొప్పిలో ఈ లక్షణాలుంటే.. ప్రమాదమే!

- Advertisement -