యుఎస్ ఓపెన్ విజేతగా డొమినిక్‌..

277
us open title

యుఎస్ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ సంచలనం సృష్టించాడు. తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ని గెలుచుకున్నారు. సిరీస్ ప్రారంభంనుండి అద్భుత ఆటతీరుతో ఎక్కడ పొరపాటు జరగకుండా గతంలో చేసిన తప్పిదాలను రిపీట్ కాకుండా ఆడి యుఎస్ ఓపెన్‌ విజేతగా నిలిచాడు.

జర్మన్‌కి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (8/6) తేడాతో డొమినిక్ థీమ్ గెలిచాడు. తొలి రెండు సెట్లను కొల్పోయిన డొమినిక్ తర్వాత అనూహ్యంగా పుంజుకుని టైటిల్ విజేతగా నిలవడం విశేషం. దాదాపు 4 గంటల 2 నిమిషాల పాటు సాగిన పోరులో తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు.

2018, 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన డొమినిక్‌….యుఎస్‌ ఓపెన్‌లో ఒత్తిడిని జయించి విజేతగా నిలిచాడు.