బిగ్ బాస్ సీజన్ 4 నుండి అనారోగ్య కారణాలతో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పటికే గంగవ్వ అనారోగ్య కారణాలతో ఇంటి నుండి బయటకు రాగా తాజాగా నోయల్ వంతు వచ్చేసింది. అనారోగ్య సమస్యలతో నోయల్ ఎలిమినేట్ అవుతున్నాడని తెలిపిన నాగ్ ….సెండాఫ్‌లో భాగంగా ఇంటి సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించాడు.
తాను ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతూ.. కీళ్ల నొప్పులు భరించలేక పోయానని తెలిపాడు. అందుకే ఇంటి నుండి వెళ్తున్నాని తెలిపిన నోయల్…ఇకపై తాను అభిజిత్,హారిక, లాస్యల గెలుపు కోసం కృషిచేస్తానని తెలిపాడు. ఇక వెళ్తూ వెళ్తూ …అవినాష్,అమ్మా రాజశేఖర్ మాస్టర్‌లపై బాంబు విసిరాడు.
ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ …అమ్మా రాజశేఖర్, అవినాష్ ఇద్దరిని ఒక కాలు మీద నిలబడాలని కోరారు. వారు అలాగే నిలబడగా ఇంటి సభ్యులు ఒక్కొక్కరి గురించి తెలిపిన తర్వాత మాస్టర్, అవినాష్‌లను కాళ్లు నొప్పి వచ్చాయా? అని అడిగాడు.. చాలా అని చెప్పడంతో.. దాని కంటే వెయ్యిరెట్లు నొప్పి రోజూ నా రెండు కాళ్లలో ఉంటుందని తెలిపాడు.
తనకు ఓ వ్యాధి ఉందని.. ఉదయానికి నా కాళ్లు బిగుసుకుపోతాయని తెలిపాడు. వాటిని అరగంటపాటు సరిచేసుకుంటేనే నడవగలుగుతా..దాన్ని మీ ఇద్దరూ జోక్ చేస్తారు ఏంటి మాస్టార్ అంటూ ఫైర్ అయ్యాడు. కోట్ల మంది ముందు ఒకడి బాధను ఎగతాళి చేయొద్దు.. బిగ్ బాస్ హౌస్‌లో కూడా రూల్ ఉంది.. ఎటువంటి హింస చేయరాదు అని కానీ చిల్లర కామెడీ ఏంటి?? జోకరా మీరు?? ఏ అవినాష్.. నువ్వు జోకరా?? అంటూ ప్రశ్నించాడు.
దీంతో సీరియస్ అయిన అవినాష్…. నువ్ వెళ్తూ వెళ్తూ కావాలనే మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావ్.. నేను నిన్ను ఇమిటేట్ చేసినప్పుడు నవ్వావు.. ఇప్పుడు తప్పని చెప్తున్నావ్.. నువ్ ఒకానొక సందర్భంలో సహనం కొల్పోయిన అవినాష్…నోయల్‌పై పరుష పదజాలంతో మండిపడ్డాడు. మాటామాటా పెరుగుతుండటంతో నాగార్జున కల్పించుకుని హౌస్ నుంచి వెళ్లేవాళ్లు తమ ఫీలింగ్‌ని చెప్తారని అందులో నిజం ఉంటే తీసుకోండి లేదంటే వదిలేయండి అని చెప్పడంతో అవినాష్ క్షమాపణ చెప్పాడు. మొత్తంగా నోయల్ వెళ్తూ వెళ్తూ….అవినాష్,మాస్టర్‌లను ఎంత బ్యాడ్ చేయాలో అంతకంటే ఎక్కువే చేసి వెళ్లిపోయాడు.