బిగ్ బాస్ 4…. ఎపిసోడ్ 56 హైలైట్స్

170
episode 56 highlights

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 56 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 56వ ఎపిసోడ్‌లో ఇంటి నోయల్ ఎలిమినేట్ కావడం,వెళ్తూ వెళ్తూ అవినాష్,అమ్మ రాజశేఖర్ మాస్టర్‌లను టార్గెట్ చేయడం,అది కాస్త రచ్చగా మారడం,ఇక శనివారం ఎపిసోడ్‌లో అఖిల్, లాస్య సేవ్ కావడంతో ఎపిసోడ్ ముగిసింది.

గత వారం సినిమా షూటింగ్ కారణంగా బిగ్ బాస్‌ షోకి దూరంగా ఉన్న నాగ్ ….ఈ వారం మాత్రం ఆ గట్టునుంటావా?? నాగన్న.. ఈ గట్టు కొస్తావా? పాటతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రీతి మిక్సీ కంపెనీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటి సభ్యులకు వంటల పోటీ పెట్టారు. అమ్మాయిలు, అబ్బాయిల్ని రెండు గ్రూపులుగా విడగొట్టి.. అమ్మాయిలు పాలక్ పన్నీర్ కర్రీ చేయాలని.. అబ్బాయిలు రొయ్యల కర్రీ చేయాలని.. వీటిని మెహబూబ్, అభిజిత్‌లు టేస్ట్ చేసి ఎవరు బాగా చేశారో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. అయితే మాస్టర్ వండిన రొయ్యల కర్రీనే బాగుందని అభి, మెహబూబ్‌లు చెప్పడంతో ఈ టాస్క్‌లో అబ్బాయిలు విజేతలుగా నిలిచారు.

తర్వాత కులుమనాలి నుంచి ఇంటి సభ్యుల కోసం తెచ్చిన స్వెటర్స్‌ని గిఫ్ట్స్‌గా అందించారు నాగార్జున.అనంతరం అఖిల్-సొహైల్‌ల మధ్య వస్తున్న మనస్పర్థలపై వివరణ ఇస్తూ వాటిని క్లియర్ చేసుకునే విధంగా వీడియో ప్లే చేశారు. దీంతో మిస్ అండర్ స్టాండింగ్స్‌ని అర్థం చేసుకున్నారు అఖిల్,సొహైల్‌లు.

ఆ తరువాత మొనాల్.. అభిజిత్‌తో జరిగిన గొడవను మరిచిపోయి అతనికి మళ్లీ దగ్గరౌతుండటంపై నాగార్జున ఆమెకు ఓ వీడియో ప్లే చేసి చూపించారు.అరియానా కన్ఫెషన్ రూంకి వెళ్లగా.. ఆమెకు పట్ల ఇంటి సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో వీడియో చూపించారు. రేషన్ మేనేజర్ ఇవ్వలేదన్న కోపంలో అమ్మా రాజశేఖర్ ఏం మాట్లాడాడు.. అవినాష్ ఏం చేస్తున్నాడన్న దానిపై వీడియో ప్లే చేస్తూ నీ ఆట నువ్వు ఆడూ అంటూ క్లారిటీ ఇచ్చారు.

తర్వాత ఉన్న హౌస్‌ మేట్లలో తమ జర్నీలో విలన్ ఎవరో చెప్పాలని నాగార్జున కోరగా మొదటగా లేచిన అఖిల్…అభి తన విలన్ అన్నాడు. ఇక సొహైల్..అరియానాని,అమ్మా రాజశేఖర్…అభిజిత్‌,హారిక….మెహబూబ్‌ని,మెహబూబ్ ….హారికని,అవినాష్…లాస్య,లాస్య….అవినాష్ పేరుని,కెప్టెన్ అరియానా.. అఖిల్ పేరుని,అభిజిత్….అమ్మా రాజశేఖర్‌,మోనాల్ తన జర్నీలో విలన్ లాస్య అని చెప్పింది.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న అమ్మా రాజశేఖర్, మొహబూబ్, అఖిల్, లాస్య, అరియానాలో ఒకరిని సేవ్ చేసే సమయం వచ్చిందని తెలిపిన నాగ్…. గేమ్ ఆడించారు. ఒక పిల్లాడి బొమ్మ ఇచ్చి.. ఆ బొమ్మ ఏడుస్తూ ఉంటుందని.. దాన్ని ఒకరి చేతుల్లో నుంచి ఒకరు మార్చుకుంటూ ఉండాలని..ఎవరి చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ బొమ్మ నవ్వితే వాళ్లు సేఫ్ అయినట్టు అని పిల్లల టాస్క్ ఒకటి ఇచ్చారు. అయితే ఈ ఆటలో అఖిల్ సేఫ్ అయ్యాడు.

ఆరోగ్యం బాలేని కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి నోయల్‌ని పంపించేస్తున్నట్టు చెప్పారు నాగార్జున.తన కుడి కాలులో ప్రాబ్లమ్ ఉంది.. అందుకే లెఫ్ట్ లెగ్‌పై ఎక్కువ బరువు పెట్టేవాడిని. దాని వల్ల రెండో కాలికి కూడా ఇబ్బంది అయ్యింది. అలాగే వేలు కూడా కట్ అయ్యింది.. అందుకే ఆ బాధని తట్టుకోలేకపోయా అంటూ చెప్పుకొచ్చాడు నోయల్. ఆరోగ్య పరమైన కారణాలతో నోయల్ బిగ్ బాస్ హౌస్‌ని వీడుతున్నట్టు నాగ్ తెలపగానే ఇంటి సభ్యులు అంతా షాక్‌కు గురయ్యారు.

తర్వాత హౌస్‌లో ఉన్న వాళ్లని ఆట పట్టించాలని అనుకుంటున్నా అంటూ అమ్మా రాజశేఖర్, అవినాష్‌లను టార్గెట్ చేస్తూ ఒకకాలిపై నిలబెట్టి ఇంటి సభ్యుల గురించి చెబుతూ వచ్చాడు. తొలుత అభిజిత్ గురించి చెబుతూ వచ్చిన నోయల్… ఖచ్చితంగా నువ్ టాప్ 5లో ఉంటావ్. నా ముగ్గురు ఫ్రెండ్స్.. లాస్య, హారిక, అభి టాప్ 5లో ఉంటారని వీరి గెలుపుకోసం కృషిచేస్తానని తెలిపాడు.

అఖిల్, మోనాల్, అరియానా, లాస్య, మెహబూబ్, సొహైల్, హారిక, లాస్య‌ గురించి పాజిటివ్‌గా మాట్లాడి ర్యాప్ సాంగ్‌తో ఇరగదీశాడు. మాస్టర్, అవినాష్.. ఒంటికాలిపై నిలబడ్డారు కాళ్లు నొప్పి వచ్చాయా? అని అడిగాడు.. చాలా అని చెప్పడంతో.. దాని కంటే వెయ్యిరెట్లు నొప్పి రోజూ నా రెండు కాళ్లలో ఉంటుందని అది నటన కాదన్నాడు.

తనకు వ్యాధి ఉందని ఉదయానికి నా కాళ్లు బిగుసుకుపోతాయి.. వాటిని అరగంటపాటు సరిచేసుకుంటేనే నడవగలుగుతా దానిని మీరు ఎగతాలి చేయడం తనకు చ్చలేదన్నాడు. కోట్ల మంది ముందు ఒకడి బాధను ఎగతాళి చేయొద్దు.. బిగ్ బాస్ హౌస్‌లో కూడా రూల్ ఉంది.. ఎటువంటి హింస చేయరాదు అని.. అది శారీరక హింస కావచ్చు.. మానసిక హింస కావచ్చు. చిల్లర కామెడీ ఏంటి?? జోకరా మీరు?? ఏ అవినాష్.. నువ్వు జోకరా?? అంటూ ఆవేశాన్ని వ్యక్తం చేశాడు.

దీంతో సీరియస్ అయిన అవినాష్‌….నువ్ వెళ్తూ వెళ్తూ కావాలనే మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావ్.. నేను నిన్ను ఇమిటేట్ చేసినప్పుడు నవ్వావు.. ఇప్పుడు తప్పని చెప్తున్నావ్.. అంటూ నోయల్‌పై సీరియస్ అయ్యాడు. మాటామాటా పెరగడంతో హౌస్‌ నుంచి వెళ్లేవాళ్లు తమ ఫీలింగ్‌ని చెప్తారని అందులో నిజం ఉంటే తీసుకోండి లేదంటే వదిలేయండి అని చెప్పడంతో అవినాష్ క్షమాపణ చెప్పాడు. కానీ నోయల్ కనికరించలేదు. ఇక చివరగా వెళ్తూ వెళ్తూ లాస్యని సేవ్ చేసి వెళ్లాడు నోయల్.