సేఫ్ జోన్‌లో అఖిల్,లాస్య

91
lasya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ వారి నామినేషన్‌లో ఉన్న ఆరుగురిలో అమ్మా రాజశేఖర్, మొహబూబ్, అఖిల్, లాస్య, అరియానాలో శనివారం అఖిల్, లాస్య సేవ్ అయ్యారు.

ఒకరిని సేవ్ చేసేందుకు గేమ్ ఆడించారు నాగ్. ఒక పిల్లాడి బొమ్మ ఇచ్చి.. ఆ బొమ్మ ఏడుస్తూ ఉంటుందని.. దాన్ని ఒకరి చేతుల్లో నుంచి ఒకరు మార్చుకుంటూ ఉండాలని..ఎవరి చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ బొమ్మ నవ్వితే వాళ్లు సేఫ్ అయినట్టు తెలిపారు. ఈ గేమ్‌లో అఖిల్ సేవ్ కావడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక ఈ వారం అనారోగ్య కారణాలతో నోయల్ ఎలిమినేట్ కాగా వెళ్తూ వెళ్తూ తన స్నేహితురాలు లాస్యను సేవ్ చేస్తూ వెళ్లాడు. దీంతో మిగితా నలుగురు అరియానా,అమ్మా రాజశేఖర్,మెహబూబ్‌లలో ఒకరు ఇంటి నుండి బయటకు రానున్నారు. ఓటింగ్ పరంగా చూస్తే అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.