బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 82 హైలైట్స్

53
episode 82 highlights

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 82 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.బుధవారం ఎపిసోడ్‌లో భాగంగా ఇంట్లోకి దెయ్యాన్ని పంపించి హౌస్‌మేట్స్‌ని భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అంతగా సఫలం కాలేదు. తొలుత ఇంటి సభ్యులు మిర్చి మిర్చి లాంటి కుర్రాడే సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేశారు. తర్వాత ఇంటి సభ్యుల్లో ఒకర్ని ఎంచుకుని ఆ వ్యక్తి లాంతరు పట్టుకుని గార్డెన్ ఏరియాలో రాత్రి అంతా ఒంటరిగా నవ్వుతూ కూర్చోవాలని టాస్క్ ఇచ్చారు.

అవినాష్ ఈ టాస్క్ చేయడానికి ముందుకురాగా లాంతరు పట్టుకుని నవ్వుతూ గార్డెన్ ఏరియాలో కూర్చున్నాడు. దెయ్యంతో కామెడీ చేశాడు. ఇక రాత్రి మొత్తం ఇంటి సభ్యులకు నిద్రలేకుండా ఆట ఆడుకుంది జలజ దెయ్యం. ఇక నామినేషన్స్‌లో ఉన్న అఖిల్ కంటతడి పెట్టగా ఓదార్చే ప్రయత్నం చేశారు అరియానా,అవినాష్,సొహైల్.

స్టార్టింగ్ నుంచి నిన్ను చూస్తూ ఉన్నా.. నీ బిహేవియర్ చాలా బాగా నచ్చింది అంటూ అరియానా.. అభిజిత్‌తో మాట్లాడుతుండగా.. అభిజిత్ ఇంగ్లీష్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో బిగ్ బాస్ నుంచి తెలుగులో మాట్లాడాలని అనౌన్స్ మెంట్ రావడంతో.. జలజ దెయ్యం తల కిందకి కాళ్లు పైకి పెట్టి ఉండాలని శిక్ష విధించింది.

తర్వాత ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూంకి పిలిచి.. అక్కడ ఉన్న స్పూన్‌ని వెతికి తేవాలని టాస్క్ ఇచ్చారు. మొదటిగా అరియానా వెళ్లగా భయంతో వణికి పోయింది. తర్వాత అవినాష్ పేరుని కూడా పిలవడంతో ఇద్దరూ కలిసి వెళ్లారు. మొత్తం చీకటి చేయడంతో అవినాష్ వచ్చినా కన్ఫెషన్ రూంలోకి వెళ్లడానికి వణికిపోయింది. అతి కష్టం మీద స్పూన్ వెతికి పట్టుకున్నారు.

ఆ తరువాత మోనాల్ ధైర్యంగా కన్ఫెషన్ రూంకి వెళ్లింది. లైట్ లేకుండా స్పూన్‌ని ఎలా వెతకాలి అని అడిగింది. ఆ చీకట్లోనే భయపడకుండా స్పూన్‌ని వెతికిపట్టుకొచ్చింది. తర్వాత సొహైల్, అఖిల్‌లను కన్ఫషన్ రూంకి వెళ్లగా కథ వేరే ఉంటుంది అంటూ సొహైల్ పైకి ధైర్యం‌గా నటిస్తూనే లోపల తెగ భయపడ్డాడు. తర్వాత బయటకు వచ్చిన సొహైల్.. పీకుతా పెడుస్తా అన్నావ్ ఏమైందిరా అంటూ హారిక బయటనుంచి గాలి తీసేసింది. మొత్తానికి 82వ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులతో ఆటాడుకుంది జలజ.