బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 38 హైలైట్స్

229
bigg boss episode 38

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 38 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 38వ ఎపిసోడ్‌లో ఈ వారం నామినేషన్‌,కెప్టెన్సీ పోటీదారుల మధ్య విషమ పరీక్ష పెట్టారు. అమీతుమీ పేరుతో బిగ్ బాస్ పెట్టిన ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోవాలి. అరియానా టీమ్ – రెడ్, అఖిల్ టీమ్ – బ్లూ అని చెప్పారు బిగ్ బాస్‌.

ఇక అరియానాలో అభిజీత్, మెహబూబ్, లాస్య, అవినాష్, మోనాల్ ఉండగా అఖిల్ టీమ్‌లో హారిక, నోయల్, దివి, కుమార్, అమ్మ రాజశేఖర్ ఉన్నారు. ఈ పోటీకి సంచాలకుడిగా సొహైల్ ఉండగా రెండు టీమ్‌లకు విడివిడిగా బిగ్ బాస్ సమానంగా బంగారు నాణేలు ఇచ్చారు. బిగ్ బాస్‌తో కుదిరినన్ని ఎక్కువ డీల్స్ చేసుకుని ఎక్కువ బంగారు నాణేలు ఖర్చుపెట్టాలనే నిబంధన విధించారు. టాస్క్ ముగిసే సరికి ఎవరి దగ్గర తక్కువ బంగారు నాణేలు ఉంటాయో వారు విజేతలుగా నిలిచినట్లు అని విజేతలుగా నిలిచిన సభ్యులు కెప్టెన్‌ పోటీ దారులుగా ఎంపికవుతారని తెలిపారు బిగ్ బాస్. ఒక్కో డీల్ పూర్తయ్యాక ఆ డీల్‌కు నిర్ణయించిన మొత్తాన్ని సోహెల్ తీసుకోవాలని సూచించారు.

() ఎవరో ఒక మగ సభ్యుడు తన ఒంటి మీద ఉన్న బట్టలన్నింటినీ ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఈ డీల్ చేయడానికి 10 బంగారు నాణేలు బిగ్ బాస్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డీల్‌లో అఖిల్ మొదట గంటను మోగించగా కుమార్ సాయి తన ఒంటి మీద ఉన్న బట్టలన్నింటినీ విప్పి ముక్కలుగా కత్తిరించాడు.

() సెకండ్ డీల్‌లో భాగంగా ఎవరో ఒకరు తాము వేసుకున్న బట్టలు తప్ప మిగిలిన బట్టలతో పాటు వారికి సంబంధించిన వస్తువలన్నీ సర్ది బయటకు పంపించేయాలి. ఈ డీల్ చేయడానికి 20 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందని తెలపగా అరియానా గంట మోగించింది. దీంతో అభిజీత్ తన ఒంటి మీద ఉన్న బట్టలు మినహా మిగిలిన బట్టలు, ఆయనకి సంబంధించిన వస్తువలన్నీ సర్ది బయటకు పంపేశాడు.

() ఇక డీల్‌ 3లో భాగంగా ఒక అమ్మాయి తన జుట్టుని మెడపై వరకు చిన్నగా కత్తిరించుకుని రెడ్ కలర్‌ను వేసుకోవాల్సి ఉంటుందని తెలపగా ఈ డీల్ చేయడానికి 25 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పగానే అఖిల్ బెల్ మోగించారు. దీంతో హారిక జుట్టు కత్తిరించుకోవడానికి ముందుకొచ్చి చాలా ఆలోచించింది. షోకి వచ్చే ముందు హెయిర్ కట్ లాంటివి చేయించుకోనని తన అన్నయ్యకి మాటిచ్చానని.. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదని ఏడూస్తు జుట్టు కత్తిరించుకుంది హారిక.

()ఇక డీల్ 4లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఇసుక మూట, పుల్లి పెట్టారు. ఒక ఇంటి సభ్యుడు ఆ ఇసుక మూటను ఒక్క చేత్తో మార్క్ కిందకి వెళ్లకుండా బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు అదే స్థానంలో పట్టుకొని ఉండాలి. ఈ డీల్ కోసం 20 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందని తెలపగా అఖిల్ గంట మోగించాడు. దీంతో కుమార్ సాయి రంగంలోకి దిగి ఇసుక మూటను కుడి చేత్తో తాడు సహాయంతో మార్క్ కిందకు వెళ్లకుండా పట్టుకున్నాడు. అలా ఎంత నొప్పి వచ్చినా బరిస్తూ పట్టుకున్న కుమార్ సాయి ఈ డీల్‌లో విజేతగా నిలిచాడు.

()ఇక డీల్ 5లో భాగంగా ఒక ఇంటి సభ్యుడు స్టోర్ రూమ్ ద్వారా పంపే వస్తువులన్నీ కలిపి ఒక డ్రింగ్ తయారుచేసి రెండు గ్లాసుల నిండా తాగాల్సి ఉంటుంది. ఈ డీల్ కోసం 20 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందనగా అరియానా గంట మోగించడంతో లాస్య పోటీలోకి దిగి రెండు గ్లాసుల డ్రింక్ తాగేసింది.

()ఇక డీల్ 6లో ఒక ఇంటి సభ్యుడు బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు జ్యూట్‌తో అల్లిన బట్టలను ధరించి ఉండటం. ఈ డీల్ చేయడానికి 20 బంగారు నాణేలు చెల్లించాల్సి ఉంటుందనగా అరియానా గంటను కొట్టింది. దీంతో ముందుకొచ్చిన మోనాల్‌ పొట్టి జ్యూట్ బట్టల్లో అదరగొట్టింది.మొత్తంగా అమీతుమీ టాస్క్‌ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.