చెన్నై వరుస ఓటములకు బ్రేక్‌..హైదరాబాద్‌పై గెలుపు

354
csk
- Advertisement -

ఐపీఎల్ 2020లో చెన్నై పరాజయాల బాటకు బ్రేక్ పడింది. దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్‌లో 3వ విజయాన్ని నమోదుచేసింది.

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ 9,బెయిర్‌ స్టో 23,పాండే 4,పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.

అయితే అప్పటికే చేయాల్సిన టార్గెట్ భారీగా పెరిగిపోవడంతో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. విలియమ్సన్ 57 పరుగులు చేసి ఔట్ అవ్వగా విజయ్ శంకర్ 12 పరుగులు చేసిపెవిలియన్ బాటపట్టాడు. చివరలో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించిన జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది.

అంతకముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌(42: 38 బంతుల్లో ఫోర్, 3సిక్సర్లు), అంబటి రాయుడు(41: 34 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు),శామ్ కరన్ 31 రాణించడంతో చెన్నై గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(2/19), ఖలీల్‌ అహ్మద్‌(2/45),నటరాజన్‌(2/41) తలో రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -