బిగ్ బాస్ 4..ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌

242
nagarjuna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా 13 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని శనివారంతో 14వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. వీకెండ్ కావడంతో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. అదరిపోయే డ్యాన్స్‌తో ఎంటరైన నాగ్‌…ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఈ వారం హౌస్‌లోకి ఇద్దరు ఎంట్రీ(సాయి పంపన,జబర్దస్త్ అవినాష్) ఎంట్రీ ఇచ్చారని దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు అంతా హౌస్‌ నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారని భావిస్తుండగా నాగ్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయారు.

ఇక రెండోవారంలో 9 మంది ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఇప్పటివరకు ఓటింగ్ పరంగా చూస్తే అభిజిత్, గంగవ్వ టాప్ పొజిషన్‌లో ఉండగా లీస్ట్‌లో అమ్మ రాజశేఖర్, కరాటే కల్యాణి ఉన్నారు. ఇక తొలినుండి ఈ వారం కరాటే కల్యాణి ఎలిమినేషన్ గ్యారంటీ అని అంతా భావిస్తుండగా నాగ్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.