బిగ్ బాస్ 4…జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ అదుర్స్‌!

154
jabardasth avinash

అంతా అనుకున్నట్లుగా ఈసారి రెండోవారంలో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. తొలివారంలో సాయి పంపన హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా నాలుగు రోజుల తర్వాత జబర్దస్త్ అవినాష్‌ హస్‌లో అడుగుపెట్టాడు.

హౌస్‌లోకి అడుగుపెట్టిన అవినాష్‌కి ఇంటి సభ్యుల నుంచి సాధర స్వాగతం లభించింది. ఇంటి సభ్యులందరితోనూ ఇట్టే కలిసిపోయాడు అవినాష్. హౌస్‌లోకి ఎంటర్‌ అవుతూనే పంచ్‌లతో అలరించాడు. మొనాల్ దగ్గరకు వెళ్లి.. నీకు నేను పెద్ద ఫ్యాన్‌ని అని ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి తెగ ప్రయత్నించాడు. మాది కూడా పెద్ద ఫ్యామిలీ నా గురించి ఆలోచించు అంటూ ప్రేమగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఇక అందరూ అవినాష్ ను ఆట పట్టించి.. ఆడ వేషం వేశేలా చేశారు. దానికి ఏమాత్రం జంకకుండా లేడీ గెటప్ వేసుకుని.. గంగావ్వతో కలిసి కాట్ వాక్ చేశాడు. గంగావ్వను హుషారు చేశాడు. మొత్తంగా అవినాష్ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారుతుందని అంతా అంచనా వేస్తున్నారు.