మరింత తగ్గిన బంగారం ధరలు..

126
gold price

బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.49,090కి చేరింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.53,550కి చేరగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.1200 తగ్గి రూ.67,800కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది.