25న భారత్ బంద్‌…

231
bharath bandh

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ రైతు వ్య‌తిరేక బిల్లుల‌కు వ్య‌తిరేకంగా హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ త‌న‌ కేంద్ర మంత్రి ప‌ద‌వికి గురువారం రాత్రి రాజీనామా చేయగా రాష్ట్రపతి అమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది ఆలిండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ(ఐఏఎస్‌సీసీ).

కేంద్రం తీసుకున్న రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకున్నందుకుగాను దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణయించగా పంట ఉత్ప‌త్తుల‌ను రైతుల నుంచి ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌కుండా నిరోధిస్తూ ప్ర‌భుత్వం బిల్లుల‌ను రూపొందించింద‌ని విమర్శించింది.

పలు రాష్ట్రాల నుండి కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.