అర్చన @ అరియానా

205
ariyana

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 40వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల చిన్ననాటి,ఫ్యామిలీ ఫోటోలను స్క్రీన్‌ పై షేర్ చేస్తూ సభ్యులను ఎమోషన్‌కి గురిచేశారు బిగ్ బాస్‌.ఇక టాస్క్‌లో భాగంగా చిన్ననాటి జ్ఞాపకాలను ఇంటి సభ్యులతో పంచుకోవాలని కోరారు.

తొలుత వచ్చిన అరియానా తన స్టోరీ ఎప్పుడూ ఎవరికీ చెప్పొద్దు అనుకున్నా.. నా అసలు పేరు అర్చన. మా అమ్మ గవర్నమెంట్ నర్స్. అమ్మ, నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుని.. కొన్ని కారణాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్నారని తెలిపింది. నాకు ఐదేళ్లు…చెల్లి అమ్మ కడుపులో ఉండగా.. మమ్మీడాడీ విడిపోయారు. తర్వాత ఎలాంటి లోటు రాకుండా మా అమ్మ ఇద్దరిని పెంచిందని తెలిపింది.

డిగ్రీలేదు ఏం లేదు అని బలవంతంగానే హైదరాబాద్ వచ్చి రూ. 4 వేలకు జాబ్‌లో జాయిన్ అయ్యా.. అక్కడ కూడా బోలెడు రాజకీయాలు.. తిండి ఉండేది కాదు.. రూ. 800, రూ. 500 కోసం కూడా ఈవెంట్స్ చేసేదాన్ని అని తెలిపింది. అలా ఎన్నో కష్టాలు పడి అరియానాగా ఇలా మీ ముందు నిలుచున్నానని తెలిపింది.