అరియానా బర్త్ డే…అవినాష్‌ మిస్‌..!

104
ariyana

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది అరియానా. ఇక బిగ్ బాస్‌ హౌస్‌మేట్స్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడగా సోహెల్, మోనాల్‌, అఖిల్‌, మెహ‌బూబ్ లు త‌ర‌చు క‌లుస్తూ రచ్చ చేస్తుండగా అరియానా,అవినాష్‌ కూడా ప్రేక్షకుల అటెన్షన్‌ను కొట్టేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అరియానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోహెల్‌, మెహ‌బూబ్, లాస్య‌, మోనాల్‌, కుమార్ సాయి సందడి చేశారు. వీరందరికి అరియానా లంచ్ పార్టీ ఇవ్వగా ఈ పార్టీలో సోహెల్-మోనాల్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మోనాల్‌ని హ‌గ్ చేసుకొని హ‌గ్గులు, కిస్సులతో రెచ్చిపోయాడు.

అయితే అరియానా బెస్ట్ ఫ్రెండ్ అవినాష్ మాత్రం ఈ పార్టీకి మిస్ అయ్యారు. షూటింగ్ కారణంగా అవినాష్ బర్త్ డే పార్టీకి హాజరుకాలేదని సమాచారం. ఇటీవలె అవినాష్ తన యూ ట్యూబ్ ఛానల్‌ని అరియానా చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.