దేశంలో 73 లక్షలు దాటిన కరోనా కేసులు….

140
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73 లక్షలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో 63,371 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 895 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 73,70,469కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 8,04,528 యాక్టివ్ కేసులు ఉండ‌గా 64,53,780 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,12,161 మంది మృతిచెందారు.

దేశంలో గత 24 గంటల్లో 10,28,622 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు 9,22,54,927 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది.