పెళ్లి విషయం ఏడేళ్లు దాచా: లాస్య

190
lasya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 40వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల చిన్ననాటి,ఫ్యామిలీ ఫోటోలను స్క్రీన్‌ పై షేర్ చేస్తూ సభ్యులను ఎమోషన్‌కి గురిచేశారు బిగ్ బాస్‌.ఇక ఒక్కొక్కరుగా వచ్చి తమ జ్ఞాపకాలను చెప్పాలని కోరగా లాస్య కన్నీరు మున్నీరుగా విలపించింది.

తాను రైతు బిడ్డ‌నని….. 9 నెల‌లు మోస్తున్న‌ప్పుడు కూడా అమ్మ గ‌డ్డి కోయ‌డానికి వెళ్లింది. అప్పుడే క‌డుపులో ఉన్న నేను అడ్డం తిరిగాన‌ట‌. ఓ వైపు రక్తం కారుతున్నా అమ్మ‌ కిలో మీట‌రు న‌డిచి ఇంటికి చేరుకుని మంచంపై ప‌డుకుంది. ఈ ఫోటో దిగిన చోటే తాను పుట్టానని తెలిపి కన్నీరు పెట్టుకుంది.

నాన్న‌కు న‌చ్చ‌ని ప‌ని(పెళ్లి) చేసినందుకు మూడేళ్లు తనతో మాట్లాడ‌లేదని ఇక నాకు పెళ్లయిన విషయం ఏడేళ్లు దాచనని తెలిపింది లాస్య. ఈ క్రమంలో తన భర్త సపోర్టు ఎప్పటికి మర్చిపోలేనని తెలిపింది. ఇక మా నాన్నకు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు లక్షా 50 వేలు అప్పు చేశానని.. నా భ‌ర్త ముందుకు వ‌చ్చి నిల‌బ‌డ్డాడు. ఇక‌ అప్ప‌టి నుంచి నాన్న మా ఆయ‌న్ను కొడుకు అని పిలుస్తారని తెలిపింది లాస్య. ఏడేళ్ల తర్వాత మా ఇద్దరి పెళ్లి మళ్లీ గ్రాండ్‌గా జరిగిందని చెప్పుకొచ్చింది.