కెప్టెన్‌ అయినా ఈ వారం మాస్టర్‌ ఎలిమినేట్ కావాల్సిందేనా!

30
amma rajashekar

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 9 వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక 9వ వారం ఎలిమినేషన్‌లో 5 గురు అమ్మా రాజశేఖర్,అభిజిత్,అవినాష్,హారిక,మోనాల్‌ ఉన్నారు.

ఓటింగ్‌లో టాప్‌లో అభిజిత్ ఉండగా గతవారం మాదిరిగానే అమ్మా రాజశేఖర్ లీస్ట్‌లో ఉన్నారు. అయితే గత వారం ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి వచ్చిన మాస్టర్ ఈ వారం హౌస్‌ నుండి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లోనే కెప్టెన్‌ రేసులో మాస్టర్ ఉన్నా ఓటింగ్‌లో మాత్రం వెనుకబడ్డారు.దీంతో ఇప్పటివరకు ఒక్క కుమార్ సాయి తప్ప మిగితావారంతా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నవారే ఎలిమినేట్ కావడంతో మాస్టర్‌ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు.

ఇప్పటివరకు లక్షా 40 వేల 500 మంది ఓటింగ్‌లో పాల్గొనగా అభిజిత్ 45.67 శాతం ఓట్లతో హారిక 20.14,మోనాల్ 17.64,అవినాష్ 13.04,అమ్మా రాజశేఖర్ 3.52 శాతం ఓట్లతో ఉన్నారు. దీంతో లీస్ట్‌లో ఉన్న మాస్టర్‌ ఈ వారం ఇంటి నుండి బయటకు రావడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

తొలి వారంలో సూర్య కిరణ్,రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి,7వ వారంలో దివి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనమిదో వారంలో అనారోగ్య కారణాలతో నోయల్ బయటకు వెళ్లారు.