గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సూర్యాపేట ఎస్పీ భాస్కరన్..

27
green challenge

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించి,పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత ఉదృతంగా సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కామారెడ్డి ఎస్పీ ఎన్ శ్వేత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటే కార్యక్రమంలో సూర్యాపేట ఎస్పీ భాస్కరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మొక్కలు పెట్టడం ఒక హక్కుగా మలిచిన ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతఙ్ఞతలు. సీఎం హరితహారం ఎంతలా చేస్తున్నాడో దానికి కొనసాగిపుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ చేస్తున్న కృషి చాలా అభినందనియం అని అన్నారు.

ఈ రోజుల్లో పెరుగుతున్న వాహన వాడకనికి మొక్కలు పెంచడం చాలా చాలా అవసరం. దానికి తగ్గట్టుగా నేను కూడా సూర్యపేటలో ఎక్కువగా మొక్కలు పెట్టేలా కృషి చేస్తాను అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత. ఇందులో ప్రతి ఒక్కరు బాధ్యత మొక్కలు నాటి, వాటి ఎదిగే బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో నావంతు మరో ముగ్గురికి సంగ్రామ్ సింగ్ పాటిల్ ఎస్పీ ములుగు, వినయ్ క్రిష్ణా రెడ్డి కలెక్టర్ సూర్యాపేట, ఎన్ కోటి రెడ్డి ఎస్పీ మహబూబాబాద్ లకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు.