అభిజిత్ వర్సెస్ అఖిల్…మొనాల్ కంటతడి!

146
monal

బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా 30 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. సోమవారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేసే ప్రక్రియ కావడంతో ఇంటి సభ్యుల మధ్య రచ్చతో ఎపిసోడ్ ముగిసింది. అభిజిత్-అఖిల్‌ మధ్య రచ్చతో ప్రారంభమైన గొడవ చివరగా వీరిద్దరి మధ్య రచ్చ,మొనాల్‌ కంటతడితో ముగిసింది.

తొలుత అఖిల్ …అభిజిత్‌ని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. చివరగా అభిజిత్ వంతు రావడంతో అఖిల్‌ని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పే క్రమంలో గొడవ పెద్దదైంది.

అఖిల్‌ని నామినేట్ చేస్తూ గట్టిగా క్లాస్ పీకాడు. నువ్ కన్ఫ్యూజ్ అవుతావని తెలుసు.. కాని పచ్చి అబద్ధాలు ఆడతావని అనుకోలేదని అఖిల్‌పై మండిపడ్డ అభిజిత్ నీ యాటిట్యూట్ కూడా నాకు నచ్చట్లేదు. కళ్లు ఇలా చేసి చూస్తే ఎవడూ భయపడిపోడు అంటూ గట్టిగా అరిచాడు. ఈ సందర్భంగా అఖిల్ మధ్యలో మొనాల్‌ని తీసుకురావడంతో గొడవ మరింత పెద్దదైంది.

పదే పదే తన పేరును ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన మొనాల్… బోరు బోరున ఏడ్చింది. ఐ లైక్ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమే అని.. ఎవరైనా ఇష్టమే అని మీరు మీరూ చూసుకోవాలని తెలిపింది. నేషనల్ ఛానల్‌లో నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి జీవితాలతో ఆడుకోకూడదని ప్రతి విషయం టెలికాస్ట్ అవుతుందని నా క్యారెక్టర్‌ని జడ్జి చేయడానికి మీరు ఎవరు?? గట్టిగా అరిచింది.