బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 30 హైలైట్స్

139
episode 30

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా ఐదో వారంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక 30వ ఎపిసోడ్‌లో భాగంగా ఎలిమినేషన్‌కు 9 మంది నామినేట్ అవ్వడం,ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ముఖ్యంగా అభిజిత్-అఖిల్ మధ్య గొడవతో జరిగిన రచ్చ చివరగా నోయల్-సొహైల్‌, మొనాల్‌ కంటతడి మధ్య ముగిసింది.

సోమవారం ఎలిమినేషన్‌కు నామినేట్ ప్రక్రియ కావడంతో ఆలస్యం చేయకుండా అఖిల్‌తో ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు బిగ్ బాస్‌. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై ఫోమ్ పూయాలని అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో రీజన్ చెప్పాలని కోరారు.తొలుత ఎంట్రీ ఇచ్చిన అఖిల్…అభి ముఖంపై ఫోమ్ పూసి …ఒరేయ్ అని అనడానికి నీ పర్మిషన్ తీసుకున్నానని.. అయినా దానిపై రాద్దాంతం చేశాడని అందుకే ఎలిమినేట్ చేస్తున్నానని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య రచ్చ జరిగింది. తర్వాత రెండో వ్యక్తిగా రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేశాడు అఖిల్.

మాస్టర్ గేమ్‌లో ఓడిపోతున్నాడంటే ఆయనకు నచ్చదు….ఆయన చేస్తే రైట్ మిగతావాళ్లు చేస్తే రాంగ్ అంటారు అందుకే ఎలిమినేట్ చేస్తున్నాని చెప్పారు.తర్వాత వచ్చిన అరియానా గ్లోరీ రాజశేఖర్ మాస్టర్, అఖిల్‌లను నామినేట్ చేసింది. మాస్టర్‌ తనని హేళన చేస్తున్నారని పనిచేయడం లేదని అంటున్నారని ఆ కారణంతో నామినేట్ చేస్తున్నానని చెప్పింది అరియానా. దీంతో కాసేపు అమ్మ వర్సెస్ అరియానా మధ్య గొడవ జరిగింది. ఇక లాస్య వచ్చి దివిని నామినేట్ చేస్తూ కుక్ చేసేటప్పుడు నీట్‌గా ఉండటం లేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. అలాగే రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కంటతడి పెట్టేసింది.

ఇక అవినాష్…..అఖిల్‌తో పాటు రెండో వ్యక్తిగా మొనాల్‌ని నామినేట్ చేయగా సుజాత ….అఖిల్‌,అరియానాని ని నామినేట్ చేసింది. కుమార్ సాయి…నోయల్,సుజాతను నామినేట్ చేయగా సొహైల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ వాష్ రూం క్లీనింగ్‌ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కాయిన్ టాస్క్ విషయంలో సపోర్ట్ చేస్తాడని అనుకున్నానని కాని అతనే వివాదానికి కారణం అయ్యాడని రీజన్ చెప్పాడు.

ఇక మెహబూబ్.. సుజాత,లాస్యను నామినేట్ చేయగా గంగవ్వ.. నోయల్‌,అభిజిత్‌ని నామినేట్ చేసింది. రాజశేఖర్ మాస్టర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. తర్వాత వచ్చిన హారిక …..అఖిల్,మొనాల్‌ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలను తెలిపింది. దివి ……లాస్య,సొహైల్‌ని నామినేట్ చేస్తూ లాస్య పప్పు చేయడం వల్ల అందరికీ మోషన్స్ అవుతున్నాయని.. వద్దని చెప్పినా వినడం లేదని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది దివి.దీంతో లాస్య-దివి మధ్య కాసేపు రచ్చరచ్చ జరిగింది.

మోనాల్.. హారికను నామినేట్ చేస్తూ.. అభితో ఇష్యూ ఉంటే అభితో మాట్లాడతా.. ఆ విషయంలో హారిక ఇన్వాల్వ్ అవ్వడం తనకు నచ్చలేదని చెప్పింది.రెండో వ్యక్తిగా అవినాష్‌ని నామినేట్ చేస్తూ నీ కామెడీ తనకు నచ్చదని చెప్పగా అవినాష్ ఎమోషన్ అవుతూ ఇంటి సభ్యులందరికీ క్షమాపణ చెప్పాడు.

ఇక అభిజిత్ ఎంట్రీతో సీన్ రచ్చరచ్చైంది. సొహైల్‌,అఖిల్ ఇద్దరిని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పాడు. ముఖ్యంగా అఖిల్-అభిజిత్ లు ఇద్దరు సవాల్‌ విసురుకుంటూ మధ్యలో సుజాత,మొనాల్‌ని తీసుకురావడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. తనను మధ్యలోకి తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయింది మొనాల్. నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి.. జీవితాలతో ఆడుకోకూడదని ప్రతి విషయం టెలికాస్ట్ అవుతుందని గట్టిగా అరిచేసింది మొనాల్‌.

చివరిగా నోయల్ ఇంటి సభ్యులకు హితోపదేశం చేసేందుకు ప్రయత్నించగా అదికాస్త బెడిసికొట్టింది.తొలుత అమ్మరాజశేఖరి మాస్టర్‌ని ఎలిమినేట్ చేస్తూ స్వాతి దీక్షిత్ ఇంటి నుండి వెళ్లిపోవడానికి మీరే కారణం అంటూ చెప్పారు. మీ వల్ల మొగ్గ ఎదగకుండానే వెళ్లిపోయిందని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక మధ్యలో సొహైల్ కల్పించుకోవడంతో గొడవ పెద్దదిగా మారి మధ్యలో దివి-సొహైల్ మధ్య రచ్చ, నోయల్ తిరిగి సొహైల్‌నే నామినేట్ చేయడంతో ముగిసింది. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నిలిచారు.