బిగ్ బాస్ 4….దివి వర్సెస్ సొహైల్ రచ్చ రచ్చ!

186
divi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఎపిసోడ్ 30లో భాగంగా సోమవారం నామినేషన్ ప్రక్రియ కావడంతో ఇంటి సభ్యుల మధ్య రచ్చ రచ్చ జరిగింది. అఖిల్-అభిజిత్ మధ్య గొడవతో మొనాల్ కంటతడి పెట్టగా చివరగా సొహైల్ -దివి మధ్య ఘర్షణ వాతావరణంతో హాట్ హాట్‌గా సాగింది.

చివరిగా నోయల్…తొలుత అమ్మరాజశేఖర్‌ని నామినేట్ చేయగా రెండో వ్యక్తిగా సొహైల్‌ని నామినేట్ చేశారు. ఇందుకు సంబంధించి రీజన్‌ స్వాతి అని చెప్పడంతో సొహైలె ఎంటరై నోయల్‌తో వాదనకు దిగారు. తన తప్పు ఉంటే సారి చెబుతానని ఇందుకు ఉదాహరణగా అమ్మ రాజశేఖర్ మాస్టర్‌కి తాను సారి చెప్పానని తెలిపాడు.

తన తప్పు లేకుంటే దివికి ఇప్పటికి సారి చెప్పలేదని తెలపగా దివి అభ్యంతరం వ్యక్తం చేసింది. సొహైల్‌ మళ్లీ నాకు అది అవుతుంది అని అనడంతో..‘ఏమౌతుంది?? లోపల ఏమైనా అవుతుందా??’ అంటూ ఫైర్ గట్టి కౌంటర్ ఇచ్చింది దివి. ఇక అభి కూడా ఏమౌతుంది అంటూ సీరియస్ కావడంతో..హారిక కూడా అందుకుని రాంగ్ పస్పెక్షన్ అంటూ తనలోకి ఇంగ్లీష్ మేడమ్‌ని బయటకు తీసింది. దీంతో కాసేపు అరిచిన సొహైల్…చివరగా నోయల్ ఎంట్రీతో చల్లబడ్డాడు. మొత్తంగా ఎపిసోడ్ 30 రచ్చ రచ్చగా సాగింది.