బిగ్‌బాస్ 4 ‌లో గంగవ్వ రికార్డు..!

155
gangavva
- Advertisement -

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ పూర్తైపోయాయి. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. అందులో గంగవ్వ కూడా ఉండటం గమనార్హం.

అయితే మొదటి వారంలోనే ఎలిమినేషన్ లో ఉండటంతో సోషల్ మీడియలో గంగవ్వ ఫాలోవర్స్ ఇప్పుడు భారీ ఎత్తున ఓట్లు వేస్తున్నారట. చాలా మంది సోషల్ మీడియాలో గంగవ్వకు ఓట్లు వేసి మరీ ఆ స్ర్కీన్‌ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గంగవ్వకు ఈసారి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కు రానన్ని ఓట్లు గంగవ్వకు వస్తున్నట్లుగా ఇప్పటికే స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా గంగవ్వ సేవ్ అవుతుంది.. అదే సమయంలో ఆమెకు రికార్డు స్థాయి ఓట్లు పడుతాయంటున్నారు. తదుపరి స్థానంలో నిలిచే వ్యక్తి కంటే లక్షల ఓట్లు ఎక్కువగా గంగవ్వకు వస్తాయని అంటున్నారు.

- Advertisement -