గంగవ్వతో రాజ రాజ చోర

159
gangavva

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజ రాజ చోర. యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తుండగా హసిత్ గోలి దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతోంది.

రీసెంట్‌గా విడుద‌లైన ఎంట‌ర్‌టైనింగ్ టీజ‌ర్‌, పాట‌లు స‌హా ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆగ‌స్ట్ 19న సినిమా విడుదలకానుండగా మై విలేజ్ షో గంగవ్వతో సినిమా ప్రమోషన్‌ని నిర్వహించారు. గంగవ్వ తెలంగాణ యాసలో ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందగా బిగ్ బాస్‌లో సైతం అందరిని ఆకట్టుకున్నారు. దీంతో గంగవ్వతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆమెకు మరింత ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌బోతుండగా మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. వేద రామ‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందించారు. తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేదరామన్,సంగీతం: వివేక్ సాగర్,ఎడిటింగ్: విప్లవ్ నైషధం,ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి,సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల,
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్,రచన-దర్శకత్వం: హసిత్ గోలి.

Gangavva tho muchatlu |ft. Sri Vishnu, Sunaina | My village Show comedy