దాసోజు శ్రవణ్ వర్సెస్‌ నిరంజన్‌ రెడ్డి..కాంగ్రెస్‌లో వర్గపోరు

133
sravan

టీ కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలే దాసోజు శ్రవణ్, టి నిరంజన్ మధ్య మాటల యుద్ధం నెలకొంది.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ముందే ఇద్దరు నేతలు బూతులు తిట్టుకున్నారు.

నియోజకవర్గ పరిధిలో ఏం ప్లాన్ చేశారో చెప్పాలని…స్ట్రాటజీ ప్లాన్ ఏంటని ఉత్తమ్ నేతలను అడిగే ప్రయత్నం చేస్తుండగా దాసోజు శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ ఏం చెబుతున్నారో వినాలని దాసోజు శ్రవణ్‌కు నిరంజన్ రెడ్డి సూచించగా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నవంటూ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారి హిటెక్కగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పద్దతి,ప్రోటోకాల్ లేదంటూ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమావేశంలో ఈ రసాభాస చోటుచేసుకుంది.

ఓ వైపు గ్రేటర్ ఎన్నికలు మరోవైపు పీసీసీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందన్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమవడంపై కార్యకర్తలు నైరాశ్యంలో కూరుకుపోయారు.