గంగవ్వ చొరవ..లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు

97
gangavva
- Advertisement -

యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ చొరవతో ఆమె సొంతూరుకు బస్సు సర్వీసులు మొదలయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆమె సొంతూరు లంబాడిపల్లికి బస్సు సర్వీసులు నిలిపివేశారు. దీంతో తమ ఊరికి మళ్ళీ బస్సు సర్వీస్ తీసుకురావాలని అనుకొని గంగవ్వ, మై విలేజ్ షో టీం, గ్రామస్థులు కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడారు.

దీంతో ఆర్టీసీ అధికారులు లంబాడిపల్లికి మళ్ళీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసుని గంగవ్వ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది. గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ గంగవ్వకి ధన్యవాదాలు తెలిపారు.

మై విలేజ్ షో ఛానల్ లో తన కామెడీ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఛానల్ తో పేరు సంపాదించి, బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాగార్జున చొరవతో తన సొంతూళ్లో గంగవ్వ ఇల్లు కట్టుకుంది.

- Advertisement -