గాడ్‌ఫాదర్‌ తల్లిగా గంగవ్వ !

28
chiru

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుండగా ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ టీ టౌన్‌లో చక్కర్లుకొడుతోంది.

మహానటి కీర్తి సురేష్…చిరు చెల్లెలి పాత్రలో నటిస్తుండగా చిరుకి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఊటిలో జరుగుతుంది.

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ లో ప్రేక్షకులను మెప్పించింది.