విదేశీ సంస్థల సహకారంతో ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మరియు అఖిల భారత సాంకేతిక విద్యా విభాగం (ఏఐసీటీఈ) కీలక హెచ్చరికలు జారీ చేశాయి. విదేశీ విద్యా సంస్థల సహకారంతో ఎడ్‌టెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రాములకు గుర్తింపు లేదని ఒక ప్రకటన జారీ చేశాయి. ఈ మేరకు గురువారం రెండు అత్యున్నత సంస్థలు కలిసి ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి.
ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ప్రకటనలు చూసి మోసపోవద్దని విద్యార్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అలాంటి ఆన్‌లైన్ పీహెచ్‌డీలకు యూజీసీ గుర్తించదని పేర్కొన్నాయి. పీహెచ్‌డీ అడ్మిషన్ తీసుకోవడానికి ముందు యూజీసీ రెగ్యులేషన్ 2016 ప్రకారం ఆయా పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రామాణికతను నిర్ధారించుకోవాలని సూచించాయి.
యూజీసీ, ఏఐసీటీఈ ఈ తరహా హెచ్చరికలు చేయడం ఈ యేడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం ఈ యేడాది ఆరంభంలోనూ ఎడ్‌టెక్ కంపెనీలతో కలిసి దూరవిద్య ఆన్‌లైన్ మోడ్‌లో కోర్సులు అందించకుండా గుర్తింపు పొందిన వర్సిటీలు సంస్థలకు యూజీసీ, ఏఐసీటీఈ కీలక హెచ్చరికలు చేశాయి. అన్ని భారతీయ ఉన్నత విద్యా సంస్థలూ పీహెచ్‌డీ డిగ్రీలను ప్రధానం చేసేందుకు యూజీసీ నిబంధనలు సవరణలను అనుసరించడం తప్పనిసరని తేల్చి చెప్పాయి.
ఇవి కూడా చదవండి..