యూట్యూబర్లకు షాక్‌..48 లక్షల ఛానెళ్ల తొలగింపు

22
- Advertisement -

భారత్‌లోని యూ ట్యూబర్లకు షాక్. ఏకంగా 48 లక్షల ఛానెళ్లతో పాటు 29 లక్షల వీడియోలు తొలగిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది యూట్యూబ్‌. వీడియో కంటెంట్ పాలసీకి సంబంధించి YouTube పెద్ద చర్య తీసుకుంది. యూట్యూబ్‌ దాని ప్లాట్‌ఫామ్ నుండి 9.5 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. కంటెంట్ ఉల్లంఘన కారణంగా Google వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ వీడియోలను తీసివేసింది.

అదే సమయంలో అక్టోబర్-డిసెంబర్ 2024 మధ్య యూట్యూబ్‌ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలోని ప్లాట్‌ఫారమ్ నుండి 2.9 మిలియన్లకు పైగా (29 లక్షలు) వీడియోలు తొలగించింది.

మార్గదర్శకాలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలను గుర్తిస్తుంది. తొలగించిన వీడియోలలో ఎక్కువగా పిల్లలను ప్రమాదంలో పడేసే విన్యాసాలు, వేధింపులు వంటి కంటెంట్ ఉన్నట్లు గుర్తిచింది.

ఈ కంటెంట్ తమ విధానానికి విరుద్ధమని యూట్యూబ్‌ పేర్కొంది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించబడిన కంటెంట్‌లో ద్వేషపూరిత ప్రసంగం, పుకార్లు, వేధింపులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి.

యూట్యూబ్ వీడియోలను తొలగించడమే కాకుండా, దాని ప్లాట్‌ఫామ్ నుండి 4.8 మిలియన్లకు పైగా అంటే 48 లక్షల ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్‌లు స్పామ్ లేదా మోసానికి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాయని యూట్యూబ్‌ చెబుతోంది.

Also Read:చేనేత కార్మికులకు శుభవార్త

- Advertisement -