బండి సంజయ్‌పై బాల్క సుమన్ ఫైర్‌

38
suman balka

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే బాల్క సుమన్‌. బండి సంజయ్‌ స్ధాయిని తెలుసుకుని మాట్లాడాలని.. సంస్కార హీనంగా మాట్లాడటం సరికాదన్నారు.

బండి సంజయ్‌….సీఎం కేసీఆర్ మీద చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా ఏం అభివృద్ధి చేశావో తెలపాలన్నారు. స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలో ఆపించే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బండి సంజయ్‌కి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించాలన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో…లేకపోతే అంతే ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని హెచ్చరించారు బాల్క సుమన్.