రాముడే బీజేపీ ప్రచార అస్త్రం!

17
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారల్లో తమ ఎజెండా మతమే అని చెప్పకనే చెప్పారు. మొదటి నుంచి కూడా బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబడుతోందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణలో మతపరమైన వ్యాఖ్యలు చేయడం, ముస్లిం మైనారిటీ వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తూ వస్తున్నారు బండి సంజయ్. అయితే ఆయన చేసే ప్రసంగాల్లో చాలా భాగం మతపరమైనవే. ఇక తాజాగా మరోసారి తనదైన రీతిలో మతపరమైన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. జగిత్యాలలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ” అయోధ్య రామమందిరం కట్టిన పార్టీ బీజేపీ అని, ఎన్నికల ప్రచారాల్లో బరాబర్ రాముడి పేరు ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు. .

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ది ఏజండగా ఎన్నికలకు వెళ్ళడం మాని, మతాన్ని ప్రేరేపించేలా ఎన్నికలకు వెళ్ళడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారత దేశం సర్వమతాల సమ్మేళనం అని అలాంటి ఇండియాలో అని మతాల పట్ల సమాన వైఖరితో ఉండాలని రాజకీయ వాదులు సూచిస్తున్నారు. పైగా కుల, మతాలను ప్రేరేపించేలా ఎన్నికలకు వెళ్ళడం ముమ్మాటికి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసి బండి సంజయ్ పోలిటికల్ హీట్ పెంచారు. మరి రాముడి పేరు చెప్పుకొని ఎన్నికలకు వెళ్తామని బహిరంగంగా చెప్పడం నిజంగా కొంత వివాదాన్ని ప్రేరేపించే అంశమే. మరి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గాని, ఇతర పార్టీల నేతలు గాని ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read:జగన్ ప్రచారానికి ‘సిద్ధం’ ?

- Advertisement -