నిరుపేద బ్రాహ్మాణుల కోసం అశ్వినీ ఆరోగ్య సేవ పథకం..

16
- Advertisement -

అశ్వినీ ఆరోగ్య సేవా పథకం ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు డిస్కౌంట్లో వైద్య సేవలు అందించేందుకు ఇదం బ్రాహ్మం సొసైటీ నిర్ణయించింది. ఈ మేరకు అశ్వినీ సేవా కార్డు లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించింది. అశ్వినీ సేవా కార్డు చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్య నేతృత్వంలో తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు, వివిధ విభాగాల ప్రముఖ వైద్యులు హాజరయ్యారు.

ఈ మల్టీ పర్పస్ కార్డు ద్వారా మొదటి దశగా రాష్ట్ర రాజధాని హైదాబాదులోని 20 కి పైగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేద బ్రాహ్మణులకు వైద్య చికిత్సల్లో సహకారం అందనుంది. కార్డు పొందిన ప్రతి సభ్యుని కుటుంబానికి 22% నుంచి 50% వరకు వైద్య చికిత్సల్లో రాయితీ లభించనుంది.

ఇదం బ్రాహ్మం తరఫున అధ్యక్షులు ఎంవిఆర్ శాస్త్రి, కార్యదర్శి డా. వ్యాకరణం నాగేశ్వర్లు అశ్వనీ కార్డు ఆవిష్కరణలో పాల్గొన్నారు. నిరుపేద బ్రాహ్మణుల సేవ కోసం అశ్వనీ కార్డును తెచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఇదం బ్రాహ్మం సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.

Also Read:చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చైర్మన్ డా. ఎన్ సుధాకర్ రావు హాజరయ్యారు. అతిథులుగా నేషనల్ మెడికల్ కమిషన్, నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్లలో మెంబర్ గా ఉన్న డా. సంతోష్ కుమార్ క్రాలేటి, కాంటినెంటల్ హాస్పిటల్ ఎండీ డా. గురునాథ్ రెడ్డి, విరించి ఆసుపత్రి చైర్ పర్సన్ కొంపెళ్ల మాధవిలత, సత్యా డయాగ్నొస్టిక్స్ ఎండి డా. వి. శశిధర్ ప్రసాద్, తపాడియా డయాగ్నొస్టిక్స్ సీఓఓ జీ. వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -