చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

15
- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏపీ సీఐడీ న్యాయస్ధానం. దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా,సీఐడీ తరపున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం చంద్రబాబుకు రిమాండ్ విధంచగా రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది.

ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు చంద్రబాబు. తన అరెస్ట్ అక్రమమని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదని తెలిపారు. రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని చంద్రబాబు కోర్టుకు విన్నవించారు. ఇక రిమాండ్ రిపోర్టులో ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని తెలిపింది సీఐడీ. ఈ మేరకు 28 పేజీల రిపోర్టును సమర్పించింది.

ఇక ఈ రిమాండ్ రిపోర్టులో లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. సీమెన్స్ సహా ఇతర కంపెనీల ప్రతినిధులు ఇల్లందుల రమేశ్ ద్వారా కలిసిన తర్వాత ఈ ఒప్పందం జరిగిందన్నారు. బాబు, అచ్చెన్నాయుడు కలిసి స్కాం చేశారని వెల్లడించింది. వివిధ కంపెనీల నుంచి డబ్బు కిలారు రాజేశ్ ద్వారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, పీఏ శ్రీనివాస్‌కు చేరిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

Also Read:Harishrao:గీత సొసైటీలతో గౌడన్నల అభివృద్ధి

- Advertisement -