బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు నోటీసులు

110
- Advertisement -

ఓ ప్రైవేట్ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోను నిలిపివేయాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. బుధవారం విచారించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు షో నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునకు హైకోర్టు నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

అయితే బిగ్​బాస్​ ఆరో లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. దీంతో ఈ షోకి ఆదరణ ఎంతుందో..
కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. దీంతో ఈ షోకి ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ షోలో లేడి కంటెస్టెంట్లు చూపించే గ్లామర్ షో కూడా అంతా ఇంతా ఉండదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోపై పిటిషన్ దాఖలైంది. గత విచారణలో బిగ్ బాస్ షోపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970లలో వచ్చిన సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

పవన్ పై సినిమాపై ఆర్జీవీ క్లారిటీ!

ఓటీటీలోకి అభిషేక్‌ బచ్చన్‌

50 ఏళ్లపైగా స్నానం చేయని వ్యక్తి మృతి

- Advertisement -