ఎన్టీఆర్‌ వన్ మ్యాన్ షో.. బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరు ?

228
- Advertisement -

బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్‌ ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే 9మంది కంటెస్టంట్లు ఎలిమినేట్ అవగా.. మరో అయిదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో బిగ్‌బాస్‌ విన్నర్ ఎవరో నేడు సాయంత్రం 6 గంటలకు తేలిపోనుంది. 70 రోజులుగా జరుగుతున్న ఈ షో నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినా మిగతా కంటెస్టెంట్ లు కూడా నిన్నా బిగ్‌బాస్‌ హౌజ్లో సందడి చేశారు. బిగ్‌ బాస్ ఏర్పాటు చేసిన గెట్‌ టుగేదర్‌లో ఈ 15మంది డాన్స్‌లతో హుషారెత్తించారు.

big boss selfie

ప్రిన్స్, ధనరాజ్, సమీర్, సంపూర్ణేష్ బాబు, మహేష్ కత్తి, జ్యోతి, మధుప్రియ, కత్తి కార్తీక, దీక్ష అందరూ డాన్స్‌లతో హౌస్‌ను హుషారెత్తించారు. వీరికి హరితేజ, అర్చనలు చిట్టిపొట్టి డ్రెస్‌లతో జతకలిసి మాస్ మాస్ మసాలా సాంగ్స్‌తో రెచ్చిపోయారు. ఇక వీరి ఆటపాటలు ముగిసిన తరువాత ఎలిమినేట్ అయిన కన్టెస్టెంట్స్ హౌస్‌ను వీడారు. అయితే సింగర్ కల్పన, ముమైత్ ఖాన్‌లు హాజరు కాలేదు.

BOSS-01

ఆ తరువాత ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ, అర్చన, హరితేజలతో ప్రేక్షకులు లైవ్‌లో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. హైదరాబాద్‌ ఐమాక్స్ థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. ఎక్కువ మంది హరితేజ‌తో మాట్లాడగా.. నవదీప్, అర్చనలను ఇరుకున పెట్టే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక నేటి ఎపిసోడ్‌తో ఈ బిగ్ బాస్ సీజన్ 1 ముగుస్తుండటంతో బిగ్‌బాస్ టైటిల్ గెలిచి ఆ యాభై లక్షల ప్రైజ్‌మనీ ఎవరు సొంత అవుతాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఎప్పుడూ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే బిగ్‌బాస్ షో ఆదివారం ఆరు గంటలకే మొదలుకానుంది. ఇక బిగ్‌బాస్ ఫైనలిస్టులో శివబాలాజీకి విపరీతమైన క్రేజ్ వుందట. బాలాజీ తర్వాత రెండో స్థానంలో ఆదర్శ్.. నవదీప్, అర్చన, హరితేజలు ఉన్నారట. ఐతే, శివకు ఆదర్శ్ గట్టిపోటీ ఇస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి వరకు ఓటింగ్‌కు సమయం ఉండడంతో వీళ్లిద్దరిలో బిగ్‌బాస్ విజేత ఎవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఆదివారం రాత్రి.. తారక్ వన్‌ మ్యాన్ షోగా దాదాపు 4 గంటలపాటు బిగ్‌బాస్ షో ఆకట్టుకోనుంది.

- Advertisement -