బిగ్‎బాస్-2 నుంచి మ‌రో వీడియో..

238
Nani Bigg Boss
- Advertisement -

బిగ్‎బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మానికి నాని వ్యాఖ్వాత‌గా వ్య‌వ‌హరిస్తున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 10న బిగ్‎బాస్2 ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా బిగ్‎బాస్ నిర్వాహ‌కులు ప్ర‌చార కార్య‌క్ర‌మాల జోరు పెంచేశారు. తాజాగా ఓ వీడియోని విడుద‌ల చేసింది.

ఎన్టీఆర్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన బిగ్‎బాస్ సీజ‌న్-1 భారీ విజ‌యం అందుకోవ‌డంతో రెండ‌వ సీజ‌న్‎పై నిర్వాహ‌కులు భారీ మొత్తంలో ఖ‌ర్చుచేస్తున్నారు. ఇందులో 16 మంది సెల‌బ్రిటీలు, 100 రోజులు ఈ సీజ‌న్ హంగామా కొన‌సాతుంది. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తి శ‌ని, ఆదివారాలో రాత్రి 9 గంట‌ల‌కు, ప్ర‌తి సోమ, శుక్ర వారాల్లో 9.30 గంట‌ల‌కు బిగ్‎బాస్ ప్ర‌సారం కానుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని పెంచేశాయి. ఇక నేడు విడుద‌లైన వీడియోలో మొద‌ట ఓ అక్వేరియంలో వివిధ రకాల చేపలని చూపిస్తూ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో రకంలా ఉంటారని చెబుతూ నాని వాయిస్ ఓవ‌ర్‎తో విడుద‌ల చేశారు. ఈ వీడియో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. మీరు ఓ లుక్కెయ్యండి.

- Advertisement -