ఎమ్మెల్యేల కొనుగోలు..కీగా ఆడియో క్లిప్

293
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల డీల్‌తో ముందుకొచ్చిన వ్యవహారంలో ఆడియో క్లిప్ కీలకంగా మారింది. బీజేపీ కీలక నేతలతో ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఎమ్మెల్యేలు రికార్డు చేయగా, ఎమ్మెల్యేల సమక్షంలోనే మాట్లాడుతున్న ఈ ఆడియోలను పోలీసులు వీడియోగ్రఫీ చేశారు.

ఇక 88 సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. కొనుగోలు వ్యవహారాన్ని పూర్తిగా వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2 నాయకుడితో మాట్లాడించే ప్రయత్నం చేశారు నంద కుమార్. అలాగే ఫార్మ్ హౌస్ లోని గంట 20 నిమిషాల గలా సీసీ కెమెరా టేప్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తెలంగాణ తర్వాత ఢిల్లీ, ఆంద్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు ఉందని ఎమ్మెల్యేలకు చెప్పారు మిడియేటర్లు.

ఇక ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి తీవ్ర నిరసనలు వస్తున్నాయి. బీజేపీ నేతల తీరును ఎండగడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. తెలంగాణ సమాజం డబ్బులకు అమ్ముడు పోదని మా ఎమ్మెల్యేలు నిరూపించారని…డబ్బు సంచుల రాజకీయాలు ఇక్కడ చెల్లవని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు నోటీసులు

ఓటీటీలోకి అభిషేక్‌ బచ్చన్‌

ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు..

- Advertisement -