50 ఏళ్లపైగా స్నానం చేయని వ్యక్తి మృతి

230
- Advertisement -

మనం ఒక్క రోజు స్నానం చేయకపోతే .. కంపు కొడుతుంది. 50 ఏళ్లు స్నానం చేయకుండా ఉండగలమా.? అయితే ఓ మనిషి 50 ఏళ్లు స్నానం చేయకుండా ఉన్నాడు. ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి 5 దశాబ్దాలకు పైగా స్నానం చేయకుండా రికార్డ్ సృష్టించాడు. అతను కేవలం కుళ్లిన మాంసం తినేవాడు. చెరువులో నీళ్లు తాగి బతికేవారు. వరల్డ్ మోస్ట్ డర్టీ మ్యాన్ గా రికార్డ్ నెలకొల్పాడు. అయితే దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా అమో హాజీ తన 94 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ప్రపంచంలోని అత్యంత మురికి మనిషి” అని పిలవబడే వ్యక్తి మరణించాడని ఆదేశ ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటి వరకు సబ్బుగాని, ఒంటిపై నీటినిగాని పోసుకోలేదు. అతను యుక్త వయస్సులో ఉన్నప్పుడు మానసికక్షోభకు గురై ఒంటరిగా జీవించాలనుకున్నాడు. అతనికి నీళ్లు అంటే భయం. స్నానం చేస్తే అనారోగ్యానికి గురవుతారనే భావన. ఏళ్ల తరబడి స్నానం చేయకపోవడం వల్ల ఆయన ముఖం నల్లగా మారింది. శరీరం మొత్తం దుర్వాసన వచ్చేది. బట్టలు కూడా మురికిగా మారాయి. అయితే కొన్ని నెలల కిందట పలువురు గ్రామస్తులు ఆయనకు స్నానం చేయించడానికి ప్రయత్నించారు. 2013లో ఆయన జీవితంపై ‘‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ’’ అనే చిన్న డాక్యుమెంటరీ సినిమా కూడా రూపొందించారు.. చాలా రోజుల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న అమో హాజీ.. దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో ఆదివారం మరణించారని వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదించింది.

ఇవి కూడా చదవండి

అందరి మ్యాచ్‌ ఫీజు సమానం

చార్‌ధామ్‌ నేటితో ముగిసింది

నిన్ను చూస్తే గర్వంగా ఉంది

- Advertisement -