ఏపీలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు..

34
corona

ఏపీలో గత 24 గంటల్లో 66,002 కరోనా టెస్టులు నిర్వహించగా 1,221 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 202 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 19 కేసులు గుర్తించారు. తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు వచ్చాయి.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 10 మంది మరణించగా 1,829 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 8,59,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,37,630 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,382 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,920కి పెరిగింది.