రేపటి నుండి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్‌..

182
minister ktr
- Advertisement -

శనివారం నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి రేపు కేటీఆర్‌ రోడ్‌ షో మొదలవనుంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 4 చోట్ల నిర్వహించనున్న రోడ్‌షోల్లో కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉండనుంది.

శనివారం కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌..సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో రోడ్‌షో, 6గంటలకు మూసాపేట్‌ చిత్తారమ్మ తల్లి చౌరస్తాలో రోడ్‌షో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం ఐడీపీఎల్‌ చౌరస్తా.. 8 గంటలకు సాగర్‌ హోటల్‌ జంక్షన్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -