రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 40 మరణాలు..

100
Corona Cases In AP

ఏపీలో కొన్నివారాలుగా కరోనా ప్రభావం తగ్గుతూవస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,242 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 7,084 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 40 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 863 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 192 కేసులు వెల్లడయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కి పెరిగింది. ఇప్పటివరకు 6,58,875 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 54,400 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తం మరణాల సంఖ్య 5,981కి పెరిగింది.

కృష్ణాలో 6, అనంతపూర్‌లో 5, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 4, నెల్లూరులో 4, ప్రకాశంలో 3, విశాఖలో 3, శ్రీకాకుళంలో 2, పశ్చిమగోదావరిలో 2, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయారు. ఏపీలో భారీగా కరోనా టెస్టులు చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 72,811 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 60,94,206 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.