ముంబై ఖాతాలో మరో విజయం..

117
Mumbai Indians

రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఖాతాలో మరో గెలుపు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముంబయి విసిరిన 209 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సులు) రాణించాడు. బెయిర్ స్టో (15 బంతుల్లో 25), మనీష్ పాండే (19 బంతుల్లో 30) ఫర్వాలేదనిపించినా భారీస్కోర్లు నమోదు చేయలేకపోయారు.

కేన్ విలియమ్సన్ (3), ప్రియమ్ గార్గ్ (8) విఫలం కావడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. చివరి వరుస బ్యాట్స్ మన్ పోరాడేందుకు ప్రయత్నించినా, బుమ్రా, బౌల్ట్, పొలార్డ్ ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వారు పరుగులు జోడించలేకపోయారు. ముంబై బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌(2/28), జేమ్స్‌ పాటిన్సన్‌(2/29), బుమ్రా(2/41) హైదరాబాద్‌ జట్టును కట్టడి చేసి జట్టు విజయంలో దోహదపడ్డారు.