బిగ్ బాస్: అబ్బాయి గెటప్‌లో గంగవ్వ.. వీడియో

187
Bigg Boss

బిగ్ బాస్ హౌజ్‌ సీజన్‌ 4లో ఈరోజు రాత్రి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌లో అమ్మాయిలు.. అబ్బాయిలుగా, అబ్బాయిలు.. అమ్మాయిలుగా కనిపించ‌నున్నారు. తాజాగా ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుద‌ల చేసింది స్టార్‌ మా. ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిల‌కి, అబ్బాయిల‌కి తేడా లేదు. ఇద్ద‌రు ఒక‌టే అని అన్నారు.

ఇక అమ్మాయిల గెటప్స్‌లో అబ్బాయిలు వ‌య్యారాలు ప‌డుతుంటే నాగార్జున వారిని చూడ‌లేక‌పోయారు. మిమ్మ‌ల్ని ఇలా చూసాక నాకు రాత్రి ఎలాంటి క‌ల‌లు వ‌స్తాయో అంటూ చిరు న‌వ్వు న‌వ్వారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల గెటప్స్‌లోకి మార‌గా, ప్యాంట్ ష‌ర్ట్ ధ‌రించిన గంగ‌వ్వ మాత్రం త‌న గెట‌ప్‌తో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకుంది. మొత్తానికి సండే ఎపిసోడ్ ఫుల్ ఫ‌న్‌డేగా మార‌నుంది.