ఆనందయ్య మందు పంపిణీ షురూ..!

26
anand

నేటి నుండి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సోమవారం నుంచి పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

మందు కోసం ఎవరూ కృష్ణపట్నానికి ఎవరూ రావొద్దని….కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితుల ఇంటి వద్దకే మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తామని చెప్పారు.

కరోనా నిబంధనల మేరకే మందు పంపిణీ జరుగుతుందని… అధికారుల వద్ద పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయుష్‌ అనుమతి కోసం గత నెల 21న మందు పంపిణీని నిలిపివేయగా తర్జనభర్జనల అనంతరం నేటి నుండి మందు పంపిణీ జరగనుంది.