ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

44

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని మేకర్స్ తేల్చేశారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం.

‘రొమాంటిక్’ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో నవంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా వదిలారు. ఇక పూరి ఈ చిత్రం కోసం కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్య‌ప్ సంగీతం అందించారు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి.