‘చోర్ బజార్’.. దుమ్మురేపుతున్న టైటిల్ సాంగ్‌..

110
- Advertisement -

టాలీవుడ్ హారో ఆకాశ్ పూరి ప్రస్తుతం ‘చోర్ బజార్’ సినిమాలో నటిస్తున్నాడు. ‘జార్జి రెడ్డి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాతో తెలుగు తెరకి గెహెనా సిప్పీ కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాత బస్తీలో హీరో తన టీమ్‌తో కలిసి దొంగతనాలు చేస్తుండటంపై ఈ టైటిల్ సాంగ్ నడుస్తుంది.

సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటను అసుర .. సెల్విన్ ఫ్రాన్సెస్ .. శ్రుతి రంజని కలిసి ఆలపించారు. ఇది ర్యాప్ సాంగ్ అయినప్పటికీ సాహిత్యం అర్థం కాదు.. గందరగోళంగా అనిపిస్తుంది. హైదరాబాద్ పాత బస్తీలో హీరో.. అతని బృందం దొంగతనాలు చేసి చోర్ బజార్‌లో అమ్మేస్తుంటారనే విషయం మాత్రం విజువల్స్ పరంగా అర్థమవుతుంది.

- Advertisement -