టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

48
DC vs RR

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ పోటీపడతాయి. కాగా, అబుదాబిలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు చేశామని కెప్టెన్ సంజూ శాంసన్ వెల్లడించాడు. ఎవిన్ లూయిస్, క్రిస్ మోరిస్ స్థానంలో తబ్రెయిజ్ షంసీ, డేవిడ్ మిల్లర్ లను తీసుకున్నట్టు తెలిపాడు. ఇక ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. మార్కస్ స్టొయినిస్ స్థానాన్ని లలిత్ యాదవ్ తో భర్తీ చేస్తున్నట్టు వెల్లడించాడు.

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్ ల్లో 7 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 4 విజయాలు నమోదు చేసి ఐదో స్థానంలో కొనసాగుతోంది.