రవితేజతో ‘బచ్చన్ సాబ్’ సాంగ్‌..

87
raviteja
- Advertisement -

టాలీవుడ్‌ హీరో ఆకాశ్ పూరి తాజాగా ‘చోర్ బజార్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఆకాశ్‌కు మూడో చిత్రం. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆకాశ్ పూరి జోడీగా గెహనా సిప్పీ అలరించనుంది. ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్‌

తాజాగా ఈ సినిమా ‘బచ్చన్ సాబ్’ లిరికల్ సాంగును విడుదల చేశారు. ఈ పాటను మస్‌ మహారాజా రవితేజ చేతుల మీదుగా వదిలారు. మదీన్ స్వరపరిచిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని సమకూర్చగా మంగ్లీ ఆలపించారు. ఇంతవరకూ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన ఆకాశ్ పూరి.ఈ సారి మాస్ ఇమేజ్ వైపు పూర్తి దృష్టి పెట్టి చేసిన సినిమా ఇది. ‘జార్జి రెడ్డి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి చేసిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -