కోహ్లీ కొట్టిన భారీ సిక్స్ వైరల్‌.. వీడియో

52
Virat

ఐపీఎల్ 2021లో షార్జా వేదికగా శుక్రవారం సీఎస్‌కే,ఆర్‌సీబీ తలపడగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టులో నుంచి కోహ్లీ (53), పడిక్కల్ (70) మొద‌ట అద్భుతంగా రాణించిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాతి బ్యాట్స్‌మెన్ విఫ‌లం కావ‌డంతో ఆర్సీబీ ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన ఓ భారీ సిక్స్‌ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఐదో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని.. కోహ్లీ సిక్స్ కొట్టగా.. ఆ ధాటికి.. బంతి షార్జా స్టేడియం బ‌య‌ట‌ప‌డింది. ఆ సిక్స‌ర్ 82 మీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది. బ్యాట్ నుంచి వ‌చ్చిన ఆ సౌండ్ వింటే తెలిసిపోతుంది.. ఇక ఆ బంతి ఎక్క‌డికి వెళ్తుందో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని కామెంటేట‌ర్ సైమ‌న్ డూల్ అన్నాడు. ఇక గవాస్క‌ర్ ఆ షాట్‌కు కామెంట్రీ ఇస్తూ.. ఆ సౌండ్ వింటే బౌల‌ర్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌ద‌న్నాడు.