చివరి కోరిక తీరకుండానే నింగికేగాడు !

392
- Advertisement -

నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతూ నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఐతే, ఎప్పటికైనా తన కెరీర్ లో 900 సినిమాల్లో నటించాలనేది ఆయన కొరక అని చెప్పారు. “ఇప్పటికే 870 సినిమాల్లో నటించనాని.. 1000 సినిమాలు చెయ్యలేకపోయిన కనీసం 900 సినిమాలు అయినా పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ‘అరుంధతి’ సినిమా విడుదల సమయంలో కైకాల గారు చెప్పారు. అయితే, ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యారు. దాంతో కొంతకాలం సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది.

ఆ తర్వాత కోలుకున్న మళ్లీ ఆయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయలేదు. మధ్యలో కొన్ని చిత్రాల్లో తనను వెతుక్కుంటూ వచ్చిన సినిమాలను మాత్రమే ఆయన చేశారు. చివరగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు. ఇక కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఈ అంత్యక్రియలకు కైకాల గారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

కైకాల గారి మరణం పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కైకాల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నివాళి అర్పిస్తూ.. ‘సత్యనారాయణ గారు ఎంపీగా పని చేసినప్పుడు కొంత కాలం తామంతా కలిసి పనిచేసాం. సత్యనారాయణగారు తన విలక్షణమైన నటనాశైలితో పేరు, ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. కైకాల వంటి సీనియర్‌ని కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -